|
reddy udyamam |
jayaho reddy |
Home |
reddy udyamam three demands in telugu language |
|
రెడ్డిలకు విఙ్ఞప్తి ఈ 'రెడ్డి ఉద్యమం' వెబ్ సైట్ లోని "Articles,Photos,Images" మొ//వి 'Copy,Save,Download' చేసుకుని మీకు తెలిసిన రెడ్డిలకు Post చెయ్యండి. రెడ్డి ఉద్యమం Photos,Images మొ//వి |
ads 1 - touch here (or) click here
|
|
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రెడ్డిఉద్యమం యొక్క మూడు బహిరంగ డిమాండ్లు. డిమాండ్ 1 : పైవిధంగా 5 కేటగిరీలుగా విభజించిన తర్వాత ప్రజలందరికి కుటుంబకార్డులు ఇవ్వాలి. కుటుంబ కార్డులోనే కేటగిరీని కేటాయించాలి. పైన తెలిపిన 1,2 కేటగిరీల వారికి ప్రభుత్వ పథకాలు,రాయితీలు,ప్రోత్సాహకాలు,రిజర్వేషన్లు మొ//వి వర్తించకూడదు. 3,4,5 కేటగిరీల వారికి ప్రభుత్వ పథకాలు,రాయితీలు,ప్రోత్సాహకాలు,రిజర్వేషన్లు మొ//వి ఇవ్వాలి. పైవిధంగా చేస్తే కొంతకాలం తర్వాత 5 వ కేటగిరీవాళ్లు 4 వ కేటగిరీలోకి వెళ్తారు.ఇంకొంతకాలం తర్వాత 4 వ కేటగిరీవాళ్లు 3 వ కేటగిరీలోకి వెళ్తారు. మరికొంతకాలం తర్వాత 3 వ కేటగిరీవాళ్లు 2 వ కేటగిరీలోకి వెళ్తారు. చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత 2 వ కేటగిరీవాళ్లు 1 వ కేటగిరీలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇట్టి కేటగిరీల పరిశీలన నిమిత్తం 'ఇన్ కం సర్టిఫికెట్' ఆధారంగా పేదరికం 100% నిర్మూలన జరిగే అవకాశం ఉంది. ఈవిధంగా జరిగినప్పుడు ప్రజలకు ప్రభుత్వ పథకాలు గాని,రాయితీలు గాని,ప్రోత్సాహకాలు గాని,రిజర్వేషన్లు గాని అవసరం ఉండదు. డిమాండ్ 2 : గ్రామ,వార్డు,డివిజన్,పట్టణ,నగర అభివ్రుద్ధి కమిటీలు ఏర్పాటుచేసి (రైతుభరోసా,పి.ఎం కిసాన్ యోజన పథకాల డబ్బుల్ని రైతుల ఖాతాలలో జమ చేసినట్లుగా) అభివ్రుద్ధి కోసం నేరుగా నిధుల్ని ఖాతాలో జమ చెయ్యాలి. రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయపార్టీతో సంబంధంలేని వారితో అభివ్రుద్ధి కమిటీలు ఏర్పాటుచేసి నేరుగా నిధుల్ని ఇస్తే ప్రజలు తమ గ్రామాల్ని,వార్డుల్ని,డివిజన్ లను,పట్టణాల్ని,నగరాల్ని అభివ్రుద్ధి చేసుకుంటారు. మిగిలిన నిధుల్ని సంక్షేమం కోసం ఖర్చు పెట్టుకుంటారు. అవినీతి,అక్రమాలకు చెక్ పెట్టినట్లవుతుంది. ప్రజాధనం వ్రుధాగాకుండా 100 కు 100 శాతం నిధులు అభివ్రుద్ధి కోసం ఖర్చు చెయ్యబడతాయి. పైవిధంగా చేస్తే .. ప్రజలకు రాజకీయపార్టీలతో,రాజకీయనాయకులతో 90 నుండి 95 శాతం అవసరం ఉండదు. అంతేగాక వార్డుమెంబర్,సర్పంచ్,కౌన్సిలర్,మున్సిపల్ ఛైర్మన్,కార్పోరేటర్,మేయర్,ఎంపిటిసి,జడ్ పిటిసి, జడ్ పి ఛైర్మన్ మొ//గువారితో ప్రజలకు అవసరమే ఉండదు. పైవిధంగా చెయ్యడం వలన ... ఒకే ఆధార కార్డు, ఒకే ఓటర్ కార్డు, ఒకే పన్ను విధానం, ఒకే చట్టం (యు.సి.సి - యూనియన్ సివిల్ కోడ్), ఒకే రేషన్ కార్డు ఉన్నట్లుగా ' ఒకే దేశం-ఒకేపాలన ' అమలు అవుద్ది. డిమాండ్ 3 : రైతులు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుంది. రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ రైతులు తాము పండించిన పంటలకు ధరల్ని తామే నిర్ణయించే పరిస్థితిలేదు. కొన్ని పంటలకు ప్రభుత్వాలు "ఎం.ఎస్.పి" పేరుతో ధరలు నిర్ణయిస్తున్నాయి. ఆకుకూరలు,కూరగాయలు మొ//గువాటికి వ్యాపారులు ధరలు నిర్ణయిస్తున్నారు. దళారీవ్యవస్థను 100 శాతం నిర్మూలించాలి. రైతులు తాము పండించిన అన్నిరకాల పంటలకి రైతులే ధరలు నిర్ణయించుకునే విధంగా రైతుకమిటీలకే "ధరల నిర్ణయం,నియంత్రణ,స్థిరీకరణ" మొ//గు హక్కుల్ని కల్పించాలి. రైతులు తాము పండించిన అన్నిరకాల పంటలను దళారులమీద,వ్యాపారులమీద ఆధారపడకుండా నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్లు నిర్మించి కేవలం రైతులకే కేటాయించాలి. గమనిక : కులాలు,మతాలకు అతీతంగా ప్రజలంతా మాకు బహిరంగంగా మద్ధతు ఇస్తే సంతోషిస్తాం. |
ads 2 - touch here (or) click here
ads 3 - touch here (or) click here
ads 4 - touch here (or) click here
ads 5 - touch here (or) click here
ads 6 - touch here (or) click here
|
ads 7 - touch here (or) click here
|
| jai reddy | jai jai reddy | jayaho reddy |